“మనలో ఏ లోపం లేకుండా ఉండడం వల్ల కాదు మన జీవితాలు అందంగా మారేది. మనం ఏం చేసినా సరే అందులో మన మనస్సుని పూర్తిగా లగ్నం చేయడం వల్ల మన జీవితాలు అందంగా మారతాయి.”
- సద్గురు

సద్గురు

సద్గురు ఒక యోగి, మార్మికుడు ఇంకా దార్శనికుడు. సద్గురు దేశంలో బాగా పలుకుబడి కలిగిన ప్రముఖ 50 మందిలో ఒకరుగా గుర్తించబడ్డారు. ఆయన తలపెట్టిన పరివర్తన కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది జీవితాలను ఆయన స్పృశించారు. పురాతన యోగ శాస్త్రాలను సమకాలీన మనస్తత్వాలకు అనుగుణంగా చేయగల ప్రత్యేక సామర్థ్యం సద్గురుకు ఉంది. ఆయన విధానం ఏ విధమైన మత విశ్వాసాలకూ ఆపాదించబడదు, కానీ ఆత్మపరివర్తనకు శక్తివంతమైన, నిరూపితమైన పద్దతులను అందిస్తుంది.

అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన వక్త మరియు న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ ఇన్నర్ ఇంజనీరింగ్: ఎ యోగి'స్ గైడ్ టు జాయ్ కు రచయిత. సద్గురు సామాజిక ఆర్థిక అభివృద్ధి, నాయకత్వం మరియు ఆధ్యాత్మికత వంటి విభిన్న సమస్యలను ఉద్దేశించి, ఐక్యరాజ్యసమితి మరియు ప్రపంచ ఆర్థిక ఫోరమ్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ప్రధాన వేదికలలో ప్రభావవంతమైన వాణిని వినిపించారు. హార్వర్డ్, యేల్, ఆక్స్ఫర్డ్, స్టాన్ఫోర్డ్, వార్టన్ మరియు MIT లతో సహా ప్రముఖ విద్యాసంస్థలలో మాట్లాడేందుకు ఆయనను తరచూ ఆహ్వానిస్తారు.

మానవాళి యొక్క భౌతిక, మానసిక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సుకోసం అంకితమైన సద్గురు, జీవితం మరియు జీవనం పై ఆయనకు ఉన్న దృక్పథం, తనకు తారసపడే వాళ్ళని సమ్మోహితుల్ని చేసి, సవాలు విసిరి వాళ్ళని ఆశ్చర్యచకితుల్ని చేయడంలో ఎన్నడూ విఫలం కాలేదు.


పరివర్తన తీసుకురావాలన్న ఒక నిబద్దతతో

సద్గురు 1992లో ఈశా ఫౌండషన్ ను స్థాపించారు. ఇది లాభాపేక్ష లేకుండా వాలంటీర్లచే నిర్వహించబడే సంస్థ. తొంభై లక్షలమందికి పైగా వాలంటీర్ల సహకారంతో , ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 300 లకు పైగా కేంద్రాలలో నిర్వహించబడుతుంది. అంతరంగ పరివర్తన మరియు సామాజిక స్పృహతో చేపట్టిన స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాల కోసం శక్తివంతమైన యోగా కార్యక్రమాల ద్వారా, ఈశా ఫౌండేషన్ మానవ శ్రేయస్సు యొక్క అన్ని అంశాలను పరిష్కరించడం కోసం అంకితమైన భారీ ఉద్యమాన్ని సృష్టించింది. సామాజిక పునరుజ్జీవనం, విద్య మరియు పర్యావరణంపై దృష్టి సారించిన అనేక ప్రాజెక్టులను సద్గురు ప్రారంభించారు, దీని ద్వారా లక్షలాది మందికి పేదరికాన్ని అధిగమించడానికి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి మరియు సమాజ-ఆధారిత, స్థిరమైన అభివృద్ధిని సాధించడానికి మార్గం చూపబడింది.. 2017 చివరలో, సద్గురు ర్యాలీ ఫర్ రివర్స్ ను ప్రారంభించారు. ఇది ప్రమాదకర స్థాయిలో క్షీణిస్తున్న భారతదేశపు నదులను పునరుజ్జీవింపజేసేందుకు, అవలభించవలసిన సుస్థిరమైన మరియు దీర్ఘకాలిక విధాన మార్పులను అమలుచేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా చేసిన అవగాహనా కార్యక్రమం. 16 కోట్ల 20 లక్షలమంది మద్దతుదారులతో ఇది చరిత్రలోనే అతిపెద్ద పర్యావరణ అవగాహన ఉద్యమంగా మారింది.

అవార్డులు మరియు పురస్కారాలు

పద్మవిభూషణ్ అవార్డు

అసాధారణమైన మరియు విశిష్ట సేవ చేసినందుకుగానూ ఫిబ్రవరి 2017లో ఇవ్వబడిన అత్యుత్తమ వార్షిక పౌర పురస్కారాలలో ఒకటి.

న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్

జాబితాలో ఇన్నర్ ఇంజనీరింగ్: ఏ యోగి'స్ గైడ్ టు జాయ్, సెప్టెంబర్ 2016

స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్

ఐక్యరాజసమితి తాలూకు ఆర్ధిక మరియు సామాజిక కౌన్సిల్ లో

సద్గురు దేశంలో బాగా పలుకుబడి కలిగిన ప్రముఖ 50 మందిలో ఒకరుగా గుర్తించబడ్డారు.

ఇండియా టుడే మ్యాగజైన్ చేత

ఇందిరాగాంధీ పర్యావరణ పురస్కారం

భారతదేశపు అత్యుత్తమ పర్యావరణ పురస్కారం

గిన్నిస్ ప్రపంచ రికార్డు

ప్రాజెక్ట్ గ్రీన్ హాండ్స్ లో భాగంగా మూడురోజుల వ్యవధిలో 8,00,000 చెట్లను నాటినందుకు

ఇండియాటుడే అందించిన సఫైగిరీ అవార్డు

ప్రాజెక్ట్ గ్రీన్ హ్యాండ్స్ కు

సోషల్ మీడియా

మీడియాలో