మీ విరాళం ఎలా వినియోగించబడుతుంది?

ప్రతి మనిషీ, తనకు ప్రగాఢమైన ఆత్మ పరిణామాన్ని తద్వారా ఆరోగ్యం ఇంకా శ్రేయస్సును కలిగించగల సాధనాల వల్ల సాధికారతను పొందాలనేది సద్గురు యొక్క ఆకాంక్ష ఇంకా సంకల్పం.

సమూహం

ఈశా ఔట్రీచ్

"మరొకరి జీవితాన్ని మీరెంత గాఢంగా తాకితే, అంతగా మీ జీవితం సుసంపన్నమౌతుంది." — సద్గురు
ఈశా ఔట్రీచ్ అనేది ఈశా ఫౌండేషన్ సమాజ శ్రేయస్సు కోసం చేపట్టిన కార్యక్రమం. ఇది ప్రపంచ వ్యాప్తంగా మానవ సాధికారతకు మరియు సమాజ పునరుద్ధరణకు ఆదర్శవంతమైన నమూనాగా సేవలను అందిస్తుంది.

ఇంకా తెలుసుకోండి

ఆరోగ్యం

గ్రామీణ పురోభివృద్ధికి కార్యాచరణ

దక్షిణ బారతదేశంలోని 4,600 గ్రామాలలో డెబ్భై లక్షల మందికి పైగా జనాభాకి, ఉచిత వైద్య సహాయం మరియు సామాజిక పునరావాసాన్ని కల్పిస్తుంది.

ఇంకా తెలుసుకోండి

విద్య

ఈశా విద్య

తక్కువ ఖర్చులో నాణ్యమైన విద్యను అందించడం ద్వారా గ్రామీణ బాలలకు సాధికారతను కల్పించి, వారి జీవితాలలో పరివర్తన తీసుకురావడం కోసం ఆదర్శంగా నిలిచే ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. తొమ్మిది పాఠశాలలు స్థాపింపబడగా, ఈ రోజు వాటి ద్వారా 6,415 మంది విద్యార్ధులు ప్రయోజనం పొందుతున్నారు.

ఇంకా తెలుసుకోండి

పర్యావరణం

ప్రాజెక్ట్ గ్రీన్ హ్యాండ్స్

నేల మరుభూమీగా మారకుండా అరికట్టడంలో భాగంగా, తమిళనాడులో పచ్చదనాన్ని 10% పెంచేందుకు, భారీ సంఖ్యలో ప్రజలు అడవుల పునరుద్ధరణకై చేస్తున్న ఈ కృషి, భూక్షయాన్ని తగ్గించి, స్వయం సమృద్ధిని పొందడం ద్వారా నిర్వాహణ సామర్ధ్యాన్ని నెలకొల్పి, వాతావరణ మార్పులకు అడ్డుకట్ట వేస్తుంది.

ఇంకా తెలుసుకోండి

నదుల రక్షణ (ర్యాలీ ఫర్ రివర్స్)

నదుల రక్షణ అనేది భారత జీవనాడులను సంరక్షించేందుకు చేసే ఉద్యమం. అతి వేగంగా క్షీణిస్తున్న నదుల పునరుజ్జీవనానికై, 2017 లో సద్గురు ప్రారంభించిన ఈ ఉద్యమంలో భాగంగా ఆయన నదుల దయనీయ స్థితిపై అవగాహన పెంపొందించేందుకు స్వయంగా 16 రాష్ట్రాల గుండా 9300 కిలోమీటర్లకు పైగా ప్రయాణించారు.

ఇంకా తెలుసుకోండి