ఇన్నర్ ఇంజినీరింగ్ ప్రత్యక్షంగా పాల్గొనే కార్యక్రమం ద్వారా శాంభవీ మహాముద్ర క్రియా ప్రత్యక్ష ప్రసరణ అందిచబడుతుంది. ఇది ఒక ప్రాచీన క్రియ. ప్రప్రంచ వ్యాప్తంగా లక్షలాది మంది నిబద్ధతతో దీనిని సాధన చేస్తున్నారు. శాస్తీయ అధ్యయనాలు, క్రియను క్రమం తప్పకుండా సాధన చేయడం ద్వారా మెదడు పనితీరు స్థాయిలలో, నిద్రించే విధానాలు, మానసిక ఆరోగ్యం ఇంకా భౌతిక శ్రేయస్సులలో కలిగే ప్రయోజనాలను పరిశీలించింది.
ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్లైన్ కోర్సును చేసిన అభ్యర్ధులలో, ఒత్తిడి 50% నికి పైగా తగ్గినట్టు వెల్లడైంది
కార్పోరేట్ ప్రోగ్రాం రీసెర్చ్ పార్ట్నర్
ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్లైన్ వల్ల శక్తి, ఆనందం, జాగరూకత మరియు చేసే పనిలో శ్రద్ధ గణనీయంగా పెరిగాయి.
కార్పోరేట్ ప్రోగ్రాం రీసెర్చ్ పార్ట్నర్
శాంభవీ క్రియ చేస్తున్న సాధకులపై నిర్వహించిన సర్వేలో, శాంభవీ మహాముద్రను ఒక సంవత్సరం పాటు సాధన చేయడం ద్వారా గొప్ప మానసిక మరియు భావోద్వేగ పరమైన ప్రయోజనాలు పొందినట్లు వెల్లడైంది. జీవన విధానంలో ఎటువంటి మార్పులు చేయకుండానే, శాంభవీ ద్వారా మరింత శ్రద్ధ, మరింత ఆనందం, సంతోషం ఇంకా ఆంతరంగిక శాంతి కలిగినట్టు ఋజువైంది.
A study conducted on 536 Shambhavi practitioners showed improvement in the following areas:
ఆరోగ్య పరిస్థితులలో మెరుగుదలపై జరిపిన సర్వేలో, 536 మంది శాంభవీ సాధకులలో తలనొప్పులు, మైగ్రాన్, అలర్జీలు, ఆస్తమా, వెన్నునొప్పి ఇంకా ఋతు క్రమంలో సమస్యలు వంటి దీర్ఘకాలిక రుగ్మతలపై ప్రభావం చూపినట్టు ఋజువైంది. సర్వేలు, నిద్రలేమి కేసులలో గణనీయమైన మెరుగుదలను వెల్లడించాయి, అది 40% కేసులలో మందుల వాడకంలో తగ్గింపు లేదా పూర్తిగా మానివేయడానికి దారితీసింది.
క్రమం తప్పకుండా సాధన చేయడం ద్వారా మెరుగుదలను తెలియజేస్తున్న వారి శాతం
75% స్త్రీలు, ఋతుక్రమ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నట్టు అంచనా. యూకె కి చెందిన పూలే హాస్పిటల్స్ NHS ట్రస్ట్ ఇంకా ఇండియానా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన బృందం ఒకటి, శాంభవీ మహాముద్రను సాధన చేసే 128 మంది స్త్రీలతో, క్రియా సాధన ప్రారంభించక మునుపు ఇంకా ఆరునెలల పాటు క్రియా సాధన చేసిన తరువాత ఋతుక్రమ సమస్యల విస్తృతిపై ఒక ప్రశ్నావళిని నిర్వహించారు.
మాటూరి R et al. ఈశా యోగ సాధకునిలో కలిగే శ్రేయస్సు కు సంబంధించిన సర్వే మార్చి 2010
మురళీకృష్ణన్ K, బాలకృష్ణన్ B, బాల సుబ్రహ్మణ్యన్ K, విస్నేగారవ్లా F. స్వల్పకాలిక హృదయ స్పందన రేటులో కలిగే మార్పులను బట్టి కార్డియాక్ అటానమిక్ నాడీ వ్యవస్థపై ఈశా యోగా యొక్క ప్రభావాన్ని కొలవడం. జే ఆయుర్వేద ఇంటిగ్రేటెడ్ మెడిసిన్. ఏప్రిల్ 2012.
సంతోష్ J, అగర్వాల్ G, భాటియా M, నందీశ్వర SB, ఆనంద్ S. ఈశా యోగ అందించే శాంభవీ మహాముద్ర సాధనపై స్పేషియో-టెంపోరియల్ EEG స్పెక్ట్రల్ అనాలిసిస్.
వించుర్కార్ S, టెల్లీజ్ S, విశ్వేశ్వరయ్య NK. నిద్రపై దీర్ఘకాలిక ధ్యాన సాధన ప్రభావం: matched controlled trial. ఇంటర్నేషనల్ సింపోజియం ఆన్ యోగిజమ్. డిసెంబర్ 2010.
నీధిరాజన్ TP, మాటూరి R, బాలక్రిష్ణన్ B, ఋతుక్రమ సమస్యలపై ఈశా యోగ ప్రభావం.
© 2019, Isha Foundation, Inc.
షరతులు & నిబంధనలు |
గోప్యతా విధానం | పవర్డ్ బై ఫాస్ట్లీ