ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్‌లైన్

మీకు వీలైనంత సమయంలో, ఎక్కడినుంచైనా సద్గురుతో ఇన్నర్ ఇంజినీరింగ్ ను అనుభూతి పొందండి. ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్‌లైన్ లో 7 సెషన్స్ ఉంటాయి. ఒక్కో సెషన్ 90-నిమిషాల నిడివి కలిగి ఉంటుంది. ప్రాచీన యోగశాస్త్రాల నుండి గ్రహించబడి, సరాసరి మీరు జీవించే, జీవితాన్ని నిర్వహించుకునే మరియు అనుభూతి చెందే విధానంలో పరివర్తన తీసుకురాగల సమర్ధత కలిగిన శక్తివంతమైన సాధనాలు అందించబడతాయి.

కోర్సు ప్రధానాంశాలు

సునాయాస జీవనానికి ఆచరణాత్మక సాధనాలు

జీవితపు ప్రాథమిక అంశాలను స్పృశించేందుకు ధ్యాన క్రియలు

పునరుత్తేజం చేసే మరియు సమతుల్యం తీసుకొచ్చే యోగ సాధనలు

ఎరుక కోసం సాధనాలు

కొనసాగనున్న సహకారం

ట్రెజర్ ట్రోవ్ ద్వారా ప్రశ్నోత్తరాల వీడియోలను జీవితకాలం పాటు చూడగలిగే అవకాశం

కోర్సు నిర్మాణం

సెషన్ 1
జీవం నడిచే విధానం

ఈ భూమి మీద అత్యంత సంక్లిష్టమైన యంత్రం మానవ శరీరం. కానీ మీరు యుజర్ మ్యానువల్ చదవలేదు అన్వేషిద్దాం —Sadhguru

సెషన్ 2
ఒకే ఒక బంధనం

మీ కోరికను నియంత్రించకండి; దానిని పరిమితమైనదానికి పరిమితం చేయకండి. కోరికకు ఉన్న అవధుల్లేని తత్వంలో అంతిమ స్వభావం దాగి ఉంది. —Sadhguru

సెషన్ 3
జీవితాన్ని పూర్తిగా జీవించడం

మీరు ఎవరు అనేది ఎల్లలులేకుండా విస్తరించినప్పుడు మాత్రమే జీవితం మిమ్మల్ని పూర్తిగా జీవించడానికి అనుమతిస్తుంది. సంపూర్ణంగా జీవించడం లేదా పూర్తిస్థాయిలో జీవించడం అనేది ఒక జీవంగా మీరు పొందగల ఏకైక సంతృప్తి. —Sadhguru

సెషన్ 4
మీ ఆలోచనలు మీరు కాదు

మీ జీవితంలోని ప్రతి క్షణాన్ని మీరు సంపూర్ణ ఇష్టంతో నిర్వహిస్తే, మీరు ప్రతి క్షణాన్ని స్వర్గంలా మలుచుకుంటారు. అయిష్టతతో చేసే ప్రతి ఒక్కటి మీకు తప్పకుండా నరకంలా మారుతుంది. —Sadhguru

సెషన్ 5
మనసు - ఒక అద్భుతం

చాలామంది వారి మనసుని నియంత్రించాలనుకుంటారు. మీరు మీ మనస్సును దాని పూర్తి సంభావ్యతను చేరేందుకు విముక్తి కలిగించాలని నేను కోరుకుంటున్నాను. —Sadhguru

సెషన్ 6
సృష్టిలోని శబ్దాలు

పదాలు, అర్ధాలు అన్నవి మానవ మస్తిష్కంలోనే ఉన్నాయి, విశ్వంలో ఉన్నవి శబ్దాలే. —Sadhguru

సెషన్ 7
మీకు కావలసింది సృష్టించుకోవడం

మీ ఆరోగ్యం, అనారోగ్యం, మీ ఆనందం, దు:ఖం, అన్నీ లోపలినుంచే వస్తాయి మీకు శ్రేయస్సు కావాలంటే, మీరు అంతరంగంలోకి చూసే సమయం ఆసన్నమైంది. —Sadhguru

ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్‌లైన్ కు నమోదు చేసుకోండి

Enroll