ఇన్నర్ ఇంజినీరింగ్ ముగింపు

ఇన్నర్ ఇంజినీరింగ్ ముగింపు కార్యక్రమం, ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేయబడిన నగరాలలో స్వయంగా సద్గురుచే అందించబడుతుంది. ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్‌లైన్ పూర్తి చేసిన వారికి అందుబాటులో ఉంటుంది. ఈ రెండు రోజుల కార్యక్రమంలో శాంభవీ మహాముద్ర క్రియ 21- నిమిషాల శక్తిమంతమైన శుద్ధీకరణ ప్రక్రియ అందించబడుతుంది. దానిలో శ్వాస ప్రక్రియ, పునరుత్తేజం మరియు శక్తివర్ధకం చేసే సన్నాహక ఆసనాలు ఉంటాయి.

ఇంతకు పూర్వం సద్గురుతో ఈ కార్యక్రమం హాజరుకాలేని వారికి కూడా, ఇన్నర్ ఇంజనీరింగ్ ముగింపు కార్యక్రమం, సుశిక్షితులైన ఈశా యోగ బోధకులచే, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొన్ని ఈశా నగర కేంద్రాలలో తరచుగా అందించబడుతుంది.

అర్హత: ఇన్నర్ ఇంజనీరింగ్ ఆన్‌లైన్ చేసి ఉండాలి

శాంభవీ మహాముద్ర క్రియ

ఈ కార్యక్రమం ద్వారా శాంభవి మహాముద్ర క్రియ దీక్ష ఇవ్వబడుతుంది. 21-నిమిషాల నిడివి గల ఈ ప్రాచీన యోగ సాధన వల్ల శుద్ధీకరణ జరుగుతుంది. ఇది ఆధునిక ప్రపంచానికి సద్గురు అందించిన అపారమైన పరివర్తనా శక్తి. శాంభవి మీ శరీరం, మనస్సు, మనోభావాలు మరియు శక్తులు సామరస్యంతో పనిచేసేలా అనుసంధానం చేసి, మీలో ఆనందాన్ని కలిగించే రసాయనికతను నెలకొల్పి, తద్వారా మీ జీవితాన్ని మీరు కోరుకున్నవిధంగా మలచుకునేందుకు మీకు సాధికారత కల్పిస్తుంది.

ఈ రోజు, లక్షలాది మంది నిబద్ధత కలిగిన సాధకులు, దీనిని సాధన చేయడం ద్వారా, భావోద్వేగ సమతౌల్యం, శ్రద్ధ, స్థిరత్వం, శారీరక పటుత్వం మరియు ఆరోగ్యం తదితర అంశాలలో మెరుగుదలను అనుభూతి పొందారు.

శాంభవి మహాముద్ర క్రియ, ఒక నిజమైన అద్భుతం

"శాంభవి మహాముద్ర సృష్టి మూలాన్ని స్పృశించే ఒక సాధనం. మీ ఆంతరంగిక మూలాన్ని స్పృశించడం పరివర్తనకు దారితీస్తుంది."
– సద్గురు

కార్యక్రమ ప్రధానాంశాలు

సునాయాస జీవనానికి ఆచరణాత్మక సాధనాలు

జీవితపు ప్రాథమిక అంశాలను స్పృశించేందుకు ధ్యాన క్రియలు

పునరుత్తేజం చేసే మరియు సమతుల్యం తీసుకొచ్చే యోగ సాధనలు

ఎరుక కోసం సాధనాలు

శాంభవీ మహాముద్ర క్రియ

కొనసాగనున్న సహకారం మరియు గ్రూపు సెషన్లు

సంపూర్ణ శాకాహార భోజనం

ఫోటో గ్యాలరి

భవిష్యత్ కార్యక్రమాలు