యోగి, మార్మికుడు ఇంకా దార్శనికుడు అయినటువంటి సద్గురుతో మీ జీవితాన్ని పరిణామం చేసుకోండి

న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ రచయిత
దేశంలో బాగా పలుకుబడి కలిగిన ప్రముఖ 50 మందిలో ఒకరుగా గుర్తించబడ్డారు,
ఆయన చేసిన ఆసాధారణ సేవలకు, పర్యావరణ-సామాజిక కార్యక్రమాలకు గాను రాష్ట్రపతి నుండి అవార్డులను అందుకున్నారు.

న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ రచయిత
దేశంలో బాగా పలుకుబడి కలిగిన ప్రముఖ 50 మందిలో ఒకరుగా గుర్తించబడ్డారు,
ఆయన చేసిన ఆసాధారణ సేవలకు, పర్యావరణ-సామాజిక కార్యక్రమాలకు గాను రాష్ట్రపతి నుండి అవార్డులను అందుకున్నారు.

ఇన్నర్ ఇంజినీరింగ్ అంటే ఏమిటి?

"బాహ్య శ్రేయస్సు కోసం శాస్త్రసాంకేతికత విజ్ఞానం ఉన్నట్టుగానే, అంతరంగ శ్రేయస్సు కోసం కూడా అపారమైన శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం ఉంది."
సద్గురు

ఇన్నర్ ఇంజినీరింగ్ శ్రేయస్సు చేకూర్చే సాంకేతికత. ఇది యోగ విజ్ఞానం నుండి సంగ్రహించబడినది. ఒక వ్యక్తిగా మీరు ఎదిగేందుకు సహాయపడే సమగ్రమైన కోర్సుగా దీనిని అందిస్తున్నాము, ఇది మీ జీవితాన్ని, మీ పనిని మరియు మీరు నివసించే ప్రపంచాన్ని, మీరు గ్రహించి, అనుభూతి చెందే విధానంలో మార్పును తీసుకువస్తుంది.

జీవితంలోని ప్రాథమిక అంశాలను పరిష్కరించేందుకు ఇంకా ప్రాచీన విజ్ఞానంలో దాగి ఉన్న రహస్యాలను పొందేందుకు, శక్తివంతమైన ఆత్మపరివర్తన ప్రక్రియలు, శాస్త్రీయమైన యోగా సారం, ధ్యాన క్రియల ద్వారా మీరు మీ అత్యుత్తమ సామర్థ్యాన్ని అన్వేషించేలా చేయడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం.

ఆత్మాన్వేషణ మరియు ఆత్మపరివర్తన కోసం, సంతృప్తికరమైన, ఆనందదాయకమైన జీవితాన్ని సాగించడం కోసం ఇన్నర్ ఇంజినీరింగ్ ఒక చక్కని అవకాశాన్ని కల్పిస్తుంది.

ఇన్నర్ ఇంజినీరింగ్ అనేది ఆన్‌లైన్ లోనూ ఇంకా ప్రత్యక్షంగానూ వివిధ కోర్సు విధానాలలో అందుబాటులో ఉంది.

ఆన్‌లైన్

ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్‌లైన్

మీరున్న చోటునుండి, మీకు వీలైనంత వేగంలో, ఈ ఏడు ఆన్‌లైన్ సెషన్స్ ద్వారా సద్గురుతో ఇన్నర్ ఇంజినీరింగ్ కార్యక్రమాన్ని అనుభూతి చెందండి.

ఇన్నర్ ఇంజినీరింగ్ ముగింపు ఆన్‌లైన్శాంభవి మహాముద్ర క్రియ నేర్చుకోండి

ఇన్నర్ ఇంజినీరింగ్ ముగింపు ఆన్లైన్, శాంభవీ మహాముద్ర క్రియ అనే 21 నిమిషాల శక్తివంతమైన సాధనను అందిస్తుంది. అది నేరుగా మీ జీవశక్తుల స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రతి ఒక్క పార్టిసిపెంట్ అవసరాలను చూసుకునే వాలంటీర్ల సహకారంతో, ప్రత్యక్షంగా పాల్గొనే ప్రోగ్రాం యొక్క అనుభూతికి ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా ఉండేలా ఈ ప్రోగ్రాం అందించబడుతుంది.

అర్హత: అన్ని ఏడు ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్‌లైన్ సెషన్ల ముగింపు

వ్యక్తిగతంగా పాల్గొనటం

ఇన్నర్ ఇంజినీరింగ్ ముగింపుఈశా ఇన్స్టిట్యూట్‌‌లో స్వయంగా పాల్గొనాలి

ఇన్నర్ ఇంజినీరింగ్ ముగింపు కార్యక్రమంలో ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్లైన్ పూర్తి చేసిన వారికి అందుబాటులో ఉంటుంది, ఇందులో ఆత్మపరిణామం కలిగించే 21-నిమిషాల ప్రాక్టీసు ప్రసరణ జరుగుతుందిశాంభవీ మహాముద్ర క్రియ.

అర్హత: అన్ని ఏడు ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్‌లైన్ సెషన్ల ముగింపు

ఇన్నర్ ఇంజినీరింగ్ రిట్రీట్

కోయంబత్తూరులోని అబ్బురపరిచే పరిసరాల మధ్య నిర్వహించబడే ఈ రెసిడెన్షియల్ రిట్రీట్ కార్యక్రమంలో అందించే అంశాలు, ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్‌లైన్ కోర్సులోని అంశాలు ఇంకా ప్రసరణ ద్వారా పరివర్తన తీసుకువచ్చే 21-నిమిషాల సాధనశాంభవీ మహాముద్ర క్రియ. ఈ రిట్రీట్ లో మిమ్మల్ని మైమరపించే, పునరుత్తేజం కలిగించే అనుభవం కోసం తాజాగా తయారుచేసిన ఆరోగ్యకరమైన భోజనం కూడా ఉంటుంది.

అర్హతలేమీ లేవు

ప్రయోజనాలు

రోజంతా అధిక శక్తిని మరియు జాగరూకతను కలిగి ఉండడం

భావ వ్యక్తీకరణ మరియు తోటివారితో సంబంధాలు మెరుగుపడడం

మానసిక స్పష్టత, భావోద్వేగ సమతౌల్యం మరియు చేసే పనిలో మెరుగుదల

ఒత్తిడి, భయం మరియు ఆందోళనల నుండి ఉపశమనం

ఒత్తిడిలేని జీవనం ద్వారా దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి ఉపశమనం

ఆనందం, ప్రశాంతత మరియు సంతృప్తిని పొందండి

Research Findings

ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్‌లైన్ హార్వర్డ్ మెడికల్ స్కూల్ రీసెర్చ్

ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్‌లైన్ కోర్సును చేసిన అభ్యర్ధులలో, ఒత్తిడి 50% నికి పైగా తగ్గినట్టు వెల్లడైంది

ఫలితాలను చూడండి

కార్పోరేట్ ప్రోగ్రాం రీసెర్చ్ పార్ట్నర్

రుట్గెర్స్ విశ్వవిద్యాలయం రీసెర్చ్

ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్‌లైన్ వల్ల శక్తి, ఆనందం, జాగరూకత మరియు చేసే పనిలో శ్రద్ధ గణనీయంగా పెరిగాయి.

ఫలితాలను చూడండి

కార్పోరేట్ ప్రోగ్రాం రీసెర్చ్ పార్ట్నర్

ఆందోళన మరియు నిరుత్సాహం

93%
పాల్గొన్నవారు, తమలో ఆందోళన మరియు నిరాశ స్థాయిలు తగ్గినట్లుగా వెల్లడించారు.

నిద్ర నాణ్యత

REM వ్యవధిREM ను చేరుకునే సమయంనిద్రలోకి జారుకునేందుకు పట్టే సమయంసాధారణ సమూహంశాంభవీ సాధకులు1/81/3x2

తలనొప్పి మరియు మైగ్రేన్

90%
పాల్గొన్నవారు తలనొప్పి మరియు మైగ్రేన్ ల నుండి ఉపశమనం పొందినట్లు వెల్లడించారు

పని నాణ్యత మరియు ఏకాగ్రత

77%
పాల్గొన్నవారు తాము చేసే పనిలో శ్రద్ధ మరియు ఉత్పత్తి సామర్ధ్యంలో మెరుగుదలను వెల్లడించారు

మీడియాలో